భారతీయ జనతా పార్టీ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు చేపట్టింది, ఈ కార్యక్రమంలో భాగంగా బి.జే.పి నాయకురాలు ముళ్ళపూడి రేణుక వికసిత్ భారత్ 2047లో భాగంగా అంబేద్కర్ జీవితం, ఆయన రచించిన రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసిన ద్రోహం, బిజెపి అంబేద్కర్ కి ఇచ్చిన గౌరవం లాంటి ,అనేక అంశాలను ప్రజలలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో దళితులలో ముఖ్య నాయకులు, వారి వారి రంగాలలో విశేషంగా పనిచేసే వారి సామాజికవర్గంలో ప్రభావితం చేయగల వ్యక్తులను కలిసి , బిజెపి దళితులకు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడమైనది.
ఈ సందర్భంగా తణుకు టౌన్ 7వ. వార్డు ఎన్.జీ.వో కాలని లో నివాసం ఉంటున్న ఖండవల్లి రాజశేఖర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఖండవల్లి నవ రత్న కుమారీ (రిటైర్డ్ టీచర్) ఉల్లంపర్తి సూర్యారావు (SC హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు) చాపల సుందరరావు ( రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ )
శ్రీమతి ఖండవల్లి వజ్రమణి (రిటైర్డ్ హెడ్ మాస్టర్) కలిసి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషిని వివరించడమైనది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోడమంచిలి జితేంద్ర, ముప్పిడి సుబ్బయ్య, కాలనీ నాయకులు ఖండవల్లి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
