మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన గుర్తింపు కార్డులు పంపిణీ

జనసేన అధినాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సుదూర ఆలోచనతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఐడి కార్డులు రావడం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 29వ వార్డు జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ సమక్షంలో 29వ వార్డులో జనసేన పార్టీ సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి నేరుగా వారి వద్దకే చేరుకొని ఐడి కార్డులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తల క్షేమమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తల సంక్షేమానికై గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారని క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తల కుటుంబాల్లో ధైర్యం, భరోసా నింపుతున్నారని నిస్వార్ధమైన రాజకీయాలకు పవన్ కళ్యాణ్ ఊపిరి పోస్తున్నారని అంతేగాకుండా ప్రజలందరూ ఆదరించి ఉపముఖ్యమంత్రి గా ఆదరిస్తున్నారని అంతే కాకుండా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేకూరుస్తుందని కచ్చితంగా ప్రతి కార్యకర్తకి అండగా ఉంటుందని తెలిపారు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అలుపెరగని పోరాటంతో దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా జనవాణి కార్యక్రమము ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని సూపర్ సిక్స్ హామీలు అమలు దిశగా పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసైనికులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link