తణుకు మాంటిస్సొరీ స్కూల్లో ఘనంగా ఎన్.టి.ఆర్.జయంతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక మాంటిసోరి స్కూల్ ప్రాంగణమందు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ మూడు అక్షరాల పదం జగదేక సుందర రూపం నవరస నటన అధినేత నందమూరి తారక రామారావు అని అన్నారు. సభాధ్యక్షులు అనపర్తి ప్రకాష్ మాట్లాడుతూ తెలుగువారి కీర్తిని నలుదుశల చాటిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కుతుందని, బహుముఖ ప్రజ్ఞాశాలి నందమూరి అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘంటసాల కాంబినేషన్లో వచ్చిన పాటల పై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం మాంటిసోరి స్కూల్ ఉపాధ్యాయులు పైబోయిన నాగ వెంకటలక్ష్మి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాష్, ప్రధానోపాధ్యాయులు మలకపల్లి లక్ష్మి స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది మలపాక భవాని, కొల్లు పావని, షోడదాసి శాలిని, పాలాడి మహేశ్వరి, మావడూరి మంగతాయారు, గారపాటి శ్రీ కళ, ఎలిపే పూజిత, సాహితీ సామ్రాజ్యం సభ్యులు ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link