సబ్ జైల్ తణుకు మరియు మానసిక ఆసుపత్రులు భవాని నర్సింగ్ హోమ్, ప్రియాంక నర్సింగ్ హోమ్ తణుకు, సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి కే. రత్న ప్రసాద్ జిల్లా న్యాయసేవల సంస్థ ఏలూరు సబ్ జైల్ తణుకు సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు సంబంధించిన కేసు వివరములు అడిగి తెలుసుకున్నారు, ఏ ఒక్కరు స్తోమత లేక న్యాయవాదిని పెట్టుకోలేని వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని, ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని మంచిగా జీవించాలని, వారికి అందుచున్న ఆహార, వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
నల్సా మానసిక వికలాంగుల చట్టం ప్రకారం తణుకులో వున్న భవానీ నర్సింగ్ హోమ్, ప్రియాంక నర్సింగ్ హోమ్ లను సందర్శించి పేషెంట్ లకు అందుచున్న వైద్యవివరాలు గురించి డాక్టర్ లు రీమ్మలపూడి సూర్యరాజు, కుడారి ఆనంద్ లను అడిగి తెలుసుకున్నారు. ఆస్తి విషయంలో కుటుంబ తగదాలలో మానసిక వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యాయసహాయం సేవలు అందిస్తారని తెలిపారు. ఇందులో డాక్టర్ లు, న్యాయవాదులు టి. సత్యనారాయణరాజు, ఏ. అజయ్ కుమార్, జే.ఆర్.వి.వి.ఎస్. పవన్ కుమార్, జైలు సూపరింటెండెంట్ జి. మోహనరావు సిబ్బంది పాల్గొన్నారు.
