నందమూరి తారక రామారావు 102 జయంతి సందర్భంగా మన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు ఆదేశానుసారం ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు 102 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టి.డి.పి.నాయకులు ముదునూరి రవీంద్రరాజు తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్.టి.ఆర్. జీవించే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో, తెలుగుదేశం నాయకులు పాతూరి నరేంద్ర, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
