తెలుగు సినిమా, రాజకీయరంగంలో యుగపురుషుడు తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు 102వ జన్మదినం సందర్భంగా తణుకు పురుషుల శాఖా గ్రంథాలయం నందు గ్రంథాలయం అధ్యక్షురాలు రాష్ట్ర మహిళా బి.సి.నాయకురాలు, మాజీ వీవర్స్ కార్పొరేషన్ చైర్మన్ వావిళాల సరళాదేవి ఎన్.టి.ఆర్. చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తారకరామారావు రాజకీయ ప్రవేశం తెలుగు వారికి ఆత్మగౌరవం పెరిగింది అన్నారు. ఆయన ఆశయం, బడుగు బలహీన వర్గాల వారి జీవితంలో వెలుగులు నింపాయని రిజర్వేషన్ విధానం, మహిళలకు ఆస్తిలో వాటా, కిలో రెండు రూపాయల బియ్యం వంటి అంశాలతో ప్రజలు గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారు అన్నారు.
ఈ కార్యక్రమాల్లో లేబ్రేరియన్ సుగుణ కుమారి, కౌరు వెంకటేశ్వరావు, ఎమ్ .జ్యోతి, మాసాబత్తుల నాగమణి తదితరులు పాల్గొన్నారు.
