కేజీహెచ్ లో పోలీస్ అవుట్‌ పోస్ట్ తో పాటు పలు వార్డుల్లో రోగుల నిరీక్షణకు షెడ్లు – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

*కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంఖ బాగ్చీ, సూపరింటెండెంట్ శివానంద్** కేజీహెచ్ లో మెరుగైన సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ* *ప్రైవేట్ హాస్పటల్ కు దీటుగా కేజీహెచ్ లో ఆధునిక సదుపాయాలు…. కేజీహెచ్ లో మార్చురీ వద్ద పోలీస్ అవుట్‌పోస్ట్, టెస్లా సెంటర్ వద్ద రోగుల నిరీక్షణ ప్రాంతం మరియు షెడ్లు, ఫార్మసీ వద్ద రోగుల నిరీక్షణ ప్రాంతం మరియు షెడ్లు జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, పోలీస్ కమిషనర్ శంఖ బ్రాత బాగ్చి ఐ.పి.ఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కేజీహెచ్ లో మెరుగైన సదుపాయాలు కల్పనకు నిరంతర కృషి చేస్తున్నానని, ప్రణాళిక ప్రకారం మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంచి కేజీహెచ్ ను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో స్థానిక వైద్య సిబ్బంది కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. కేజీహెచ్ లో వైద్య సిబ్బందికి, రోగులకు, రోగుల కుటుంబ సభ్యులకు నిరంతరం మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపర్డెంట్ శివానంద ఏం సి ప్రిన్సిపాల్, స్థానిక కార్పొరేటర్ అప్పల రత్నం, వార్డు జనసేన అధ్యక్షురాలు యజ్ఞశ్రీ, పలు విభాగాల అధిపతులు, సిఐ జీ.డి. బాబు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link