దరఖాస్తు చేసుకున్న వారిలో 98 శాతం మందికి లబ్ధి
గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు బుట్ట దాఖలు
బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజవర్గంలో సుమారు 250 మందికి రూ.3.50 కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో ఎంతోమంది ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం పొందాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అప్పటి నేతలు వాటిని బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తణుకు పట్టణంతోపాటు రూరల్ మండలంలో 22 మందికి రూ. 20.54 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు. శుక్రవారం కూటమి కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లేని శాస్త్ర చికిత్సలకు సంబంధించి ఖర్చు చేసిన నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు. ఏడాది కాలంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల్లో 98 శాతం లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించారు. పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అర్హత కలిగి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లబ్ధి పొందలేని వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు ,తణుకు పట్టణం 4వ వార్డ్ కి చెందిన జక్కంశెట్టి నాగమణి అనారోగ్యకారణంతో బాధపడుతుంటే రూ.10 లక్షల ఆర్థికసాయం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నాగమణికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.10 లక్షల రియంబర్స్మెంట్ ఇప్పించడం జరిగింది అని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.