ఉండ్రాజవరం మండలంలో రేషన్ బియ్యం పట్టివేత – కేసు నమోదు

ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు మునిపల్లి రోడ్డులో గల జోగిరాజు కోళ్లఫారంలో బుధవారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సదరు తనిఖీల సందర్భంగా వివిధ రంగులలో గల 34 ప్లాస్టిక్ బ్యాగులలో నిలువ ఉంచిన రేషన్ బియ్యం గుర్తించారు. ఈ బియ్యం 1836 కేజీలుగా వెల్లడి అయినది. సదురు బియ్యాన్ని సీజ్ చేసి కోళ్ల ఫారం ఓనర్ అయిన మంతిన జాగరాజు తండ్రి సుబ్బారావుపై నిత్యావసర వస్తువుల చట్టం 1955 చట్టం ప్రకారం6A కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో గల రేషన్ షాపులను, ఎండియు వాహనాలను తనిఖీ చేసారు. వేలివెన్ను పరిసర గ్రామాలలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని వాతావరణ పరిస్థితులు సరిగాలేని కారణంగా వెంటనే రైస్ మిల్లులకు తరలించవలసిందిగా తెలియజేసి వారికి వారి ధాన్యాన్ని రైస్ మిల్లుల యాజమాన్యంతో మాట్లాడి రైసుమిల్లులకు తరలించు ఏర్పాట్లు చేయించారు. ఈ తనిఖీలలో సివిల్ సప్లై డిప్యూటీ తహశిల్దార్ సుధీర్, ఎస్.ఎస్.రెడ్డి, స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులు మురళి, ఏసుపాదం పాల్గొన్నారు.

Scroll to Top