టెన్త్ క్లాస్ విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కిట్ల పంపిణీలో డా.కంచర్ల
విద్యార్ధుల ఉన్నత విద్య భవిష్యత్తుకి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షే పునాదని, మంచి మార్కులతో అందరూ పాస్ కావాలని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(కెడబ్ల్యూజెడబ్ల్యూఏ) జాతీయ అధ్యక్షులు, విద్యాదాత డా.కంచర్ల అచ్యుతరావు ఆకాంక్షించారని ట్రస్ట్ మేనేజర్ సుధీర్ కుమార్ తెలియజేశారు. మంగళవారం విశాఖలోని జ్ఞానాపురం సెక్రెడ్ హార్ట్స్ బలికొనత పాఠశాలలో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా టెన్త్ విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనేజర్ డా.కంచర్ల అచ్యురావు టెన్త్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడిన అంశాలను, సూచనలు అక్కడి విద్యార్ధులకు తెలియజేశారు. టెన్త్ విద్యార్ధులందరూ చక్కగా చదువుకొని మంచి మార్కులతో పదవ తరగతి పాసై ఉపాది నిచ్చే కోర్సుల్లో చేరాలని ఆకాంక్షించిన విషయాన్ని అక్కడ విద్యార్ధులకు తెలియజేశారు. జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధుల ఫస్ట్, సెకెండ్, థర్డ్ బహుమతులను కూడా అందజేయాలని ట్రస్ట్ చైర్మన్ భావిస్తున్నారని చెప్పారు. విద్యార్ధులందరూ పోటీ పడి చదివి, మంచి మార్కులు సాధించాలని సూచించారు. అంతేకాకుండా పదవతరగతి అనంతరం విద్య విషయంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైన నిరుపేద విద్యార్ధులను ఆరిలోవలోని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టుని సంప్రదిస్తే వారికి తమవంతుగా సహకారం అందిస్తామన్నారు. ప్రతీ ఏటా మదిరిగా ఈ ఏడాది కూడా వందలాది మంది విద్యార్ధులకు గత వారం రోజుల నుంచి ట్రస్ట్ నుంచి ఈ ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కిట్లను అందజేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెక్రెడ్ హార్ట్స్ బలికొనత పాఠశాల హెడ్ మిస్ సిస్టర్ వేలాంగిని జోసెఫ్, సిస్టర్ ఆనందిని మాట్లాడుతూ, మంచి లక్ష్యంతో, ఆశయంతో, నిశ్వార్ధ సేవా భావంతో పేద విద్యార్ధులకు పదవతరగతి పరీక్షలకు ఉపయోగ పడే ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కిట్లను అందించి చక్కటి ప్రోత్సాహాన్ని విద్యాదాత డా.కంచర్ల అందజేయడం శుభ పరిణామన్నారు. ఎంతో మంచి మనసుతో పేదవిద్యార్ధులకు చేసిన సహాయం పట్ల ఉపాధ్యాయులు ఆనందం వక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కెడబ్ల్యూజెడబ్ల్యూఏ ఉపాధ్యక్షులు పి.బాలభాను(ఈరోజు బాలు) సెక్రటరీ సిహెచ్ దుర్గా ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మానాపురం సురేష్, అసోసియేషన్ ప్రతినిధి అర్జున్ కుమార్, ఉపకార్ ట్రస్ట్ ప్రతినిధులు నాగు, అరుణ, రాజు, స్కూలు సిబ్బంది, అధిక సంఖ్యలో వద్యార్ధులు పాల్గొన్నారు.