మాజీ మంత్రి విడదల రజినీతో సహా పలువురిపై ACB కేసు నమోదు చేసింది. వై.సి.పి.ప్రభుత్వ హయాంలో 2020 సెప్టెంబర్ యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను అధికారులు ఏ1 నిందితురాలిగా చేర్చారు. అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384,120బి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
