ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆదివారం తణుకు విజయ నర్సింగ్ హోమ్ ప్రాంగణంలో పితృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ నడిసొచ్చే దైవం నడిపించే వాహనం సక్రమ మార్గానికి మార్గదర్శకం నాన్న అని అన్నారు. ఈ సందర్భంగా పితృ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ గుత్తుల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జీవితానికి దిక్సూచి భవిష్యత్తుకు చక్కని పునాది తండ్రి అని అన్నారు. పితృ దినోత్సవ సందర్భంగా నాన్న నేను ఉన్న అని అంశంపై సదస్సు నిర్వహించి పలువురు వక్తలు మాట్లాడారు అనంతరం జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ గుత్తల బాలసుబ్రమణ్యాన్ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ పచ్చ మల్ల అంబేద్కర్ నర్సింగ్ హోమ్ సిబ్బంది పెదవోలు పూజిత, పులిమర్తి శైలు, చదలవాడ ఆశాజ్యోతి, దుండి బేబీ విజయలక్ష్మి, విశ్రాంత గ్రంథాలయాధికారి నున్న వెంకట రామారావు ఉపాధ్యాయులు పెరుమాళ్ళ రామదాసు, గుడాల కుమారస్వామి, తుమ్మపు నాగేశ్వరరావు, ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
