సామాన్యులకు భారం కాకుండా భూములు విలువలుపై అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరులో భూములు విలువలు అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించుటపై జిల్లా రెవిన్యూ అధికారి, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రారు, జిల్లా సర్వే అధికారి, సబ్ రిజిస్ట్రారుతో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 15 మంది సబ్ రిజిస్ట్రార్లు సమర్పించిన మార్కెటు విలువల ప్రపోజల్స్ ను నిశితంగా పరిశీలించారు. శివారు ప్రాంతాలు, గ్రామాలు భూములు, పంట భూములు, ఫిష్ ట్యాంకులు, తదితర వాటికి గతంలో ఎంత రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ప్రపోజల్స్ పెట్టారని మండలాలు వారీగా సమీక్షించారు. జిల్లాకు, పట్టణాలకు దగ్గరలో భూములు, పంట భూములు, ఫిష్ ట్యాంకులు, షాపింగు కాంప్లెక్స్, అపార్ట్మెంటు మెంట్లు, తదితర వాటికి గతంలో ఎంత రేట్లు ఉన్నాయి, ఇప్పుడు మార్కెటు విలువలు పెరుగుదలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్బంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ సామాన్యులకు భారం కాకుండా భూములు అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించాలన్నారు. ఓకే ప్రాంతంలో భూములు విలువలు ఓకే రకంగా ఉండాలని తారతమ్యాలు ఉండకూడదన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూములు విలువలు ఏ మాత్రం పెంచవచ్చునో గతం రేట్లును బేరీజు వేసుకుని రేట్లు నిర్ణయించుకోవాలన్నారు. గతంలో ఉన్న షాపింగు కాంప్లెక్స్ లకు తరవాత ఏర్పాటుచేసిన కాంప్లెక్స్ కు రేట్లలో వ్యత్యాసం లేకుండా చూసుకోవాలన్నారు. భూసాములు, ప్రజలు మా భూములు విలువలు పెరిగాయని అనుకోవాలి గాని, రేట్లు పెరిగిన కారణంగా రిజిస్ట్రేషన్ చార్జీలు భారంగా భావించేలా ఉండకూడదని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు,జిల్లా రిజిస్ట్రారు యల్.వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసి రాజు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, సబ్ జిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.