తణుకు పట్టణంలో స్థానిక 27 వ వార్డు నందు తణుకు శాసనసభ్యులు ఆరమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఇంటింటికి వెళ్లి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కు మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయేరోజుల్లో జరగబోయే గ్రాడ్యుట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి తరుపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేయుచున్నారని వారికి మద్దతుగా గ్రాడ్యుట్స్ ఓటర్ల ఇంటింటికి వెళ్లి వారి యొక్క ఓటును అభ్యర్థించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థి నాయకత్వం కలిగిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని అత్యధికమెజార్టీతో గెలిపిస్తే మన ఉభయగోదావరి జిల్లాల సమస్యలు తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని అన్నారు. మేము ఎక్కడికి వెళ్లినా పట్టభద్రులు ఆనందంగా మేము కూటమి అభ్యర్థి అయిన పేరా బత్తుల రాజశేఖరం కి ఓట్లు వేసి గెలిపిస్తామని అనడం ఆనందకరమని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ఉందని సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. కూటమ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముఖ్యంగా ఈరోజు యువతకు ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, ఈ ప్రభుత్వ లక్ష్యం అని దాన్లో భాగంగా ఈ ఎనిమిది నెలల్లో 5 లక్షల కోట్లు రాష్ట్రానికి పెట్టుబడును తీసుకొచ్చి 4 లక్షల 70 వేల మందికి ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇప్పటికీ అనేక అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు, ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి ఈరోజు కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే భవిష్యత్తులో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేసుకోవడానికి మన జిల్లాల సర్వోన్నత అభివృద్ధి సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని యువత భవిష్యత్తు కాపాడాలంటే కూటమి ప్రభుత్వ అభ్యర్థి కి మద్దతు తెలిపి పేరా బత్తుల రాజశేఖర్ కి ఒకటవ నెంబర్ పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్లను కోరారు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
