అసత్యాలు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు మాజీ మంత్రి కారుమూరిపై ఎమ్మెల్యే ఆరిమిల్లి ధ్వజం
లేహం ఫుడ్స్‌కు హైకోర్ట్ స్టే ఇవ్వడం శుభపరిణామం
అబద్దాలు, అసత్యాలను అలవోకగా పలుకుతూ నియోజకవర్గ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్న మాజీ మంత్రి కారుమూరి. గంజాయి, బెట్టింగులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన విత్తనాలు కాదా అని ప్రశ్న.
గంజాయిని పెంచి పోషించింది ఎవరో ముందు కారుమూరి గుర్తెరగాలి. నియోజకవర్గంలో కిళ్లీ దుకాణాల్లో సైతం వైసీపీ నాయకుల కనుసన్నల్లో గంజాయి వ్యాపారం చేసింది మీరు కాదా…?
ఇప్పుడు సిగ్గులేకుంగా కారుమూరి మాట్లాడుతున్నారు. గంజాయి గురించి మాట్లాడే అర్హత లేదు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా రాష్ట్రంలో మూలాలు ఉన్న సంగతి మర్చిపోయారా..?
కింది స్థాయి నుంచి జగన్మోహన్రెడ్డి వరకు గంజాయి వ్యాపారం చేసి రూ. కోట్లు దోచుకున్న మాట వాస్తవంకాదా..? ఇప్పుడు నీతి కబుర్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
కారుమూరి నువ్వు ఎన్ని అబద్ధాలు, అసత్యాలు చెప్పినా నియోజకవర్గ ప్రజలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం నుంచి ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి.
తన వ్యక్తిగతం ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఇప్పుడు తనను వ్యక్తిగతంగా దూషించేందుకు ప్రయత్నిస్తే అది సాధ్యం కాదు. దువ్వ, పైడిపర్రు ఘటనలకు తనను ఎలా బాధ్యుణ్ని చేసి మాట్లాడతావని ప్రశ్న.
దువ్వలో జరిగిన ఘటనలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన వ్యక్తులే ఉన్నారు. మహిళలపై దాడి చేసి వ్యక్తులు మీ పార్లీ నాయకులు కాదా.?
ప్రజాప్రతినిధిగా, నాయకుడిగా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశాను. పైడిపర్రు ఘటనలో దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
నియోజకవర్గంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల్లో మాజీ మంత్రి కారుమూరి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తణుకులో జరిగిన సంఘటనల్లో కారుమూరి మనుషులు ఉంటున్నారు. వెనుక ఉంటూ కొందరు నాయకులను ప్రోత్సహిస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్న.
ఇలాంటì పనులు చేస్తే రోడ్డుపై నిలబెడతా… అధికారంలో లేవు ప్రజలు తరిమి తరిమి కొట్టారనే కక్షతో ప్రజలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నావని అర్థమవుతోంది. ఇలాంటి వ్యవహారాల్లో పోలీసు శాఖను అప్రమత్తం చేసి ఎప్పటికైనా బయట పెడతాం.
యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ను ఏరిపారేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. నీలాంటి వ్యక్తులను కట్టడి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.
లేహం ఫ్యాక్టరీను 2019–2024 మధ్యలో ఆపేశానని చెబుతున్న కారుమూరి… అప్పట్లో స్టే తెచ్చి కార్యకలాపాలు నిలిపివేసింది ఎవరో తెలుసుకోండి. ఫ్యాక్టరీను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంటే స్టే తెచ్చి ఆపింది ఎవరో విచారించుకో.
కారుమూరి అధికారంలో ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయి. అప్పట్లో తన వద్దకు వచ్చిన గోసేవా సమితి సభ్యులను తహసీల్దార్ వద్దకు పంపించింది ఎవరో తెలుసుకో.
లేహం ఫ్యాక్టరీ నిలిపివేసేలా హైకోర్టు స్టే ఇవ్వడం శుభపరిణామం. భవిష్యత్తులో ఫ్యాక్టరీ కొనసాగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం.
కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.