ఇంటింటి నుండి చెత్త సేకరణ – ప్రత్యేక డ్రైవ్ ఫిబ్రవరి 22-23 తేదీల్లో
👉స్వచ్ఛ సర్వేక్షణ్ పంచాయతీలుగా మన గ్రామాన్ని నిలుపుదాం
👉- జిల్లా గ్రామపంచాయతీ అధికారి వి.శాంతమణి
👉జిల్లా వ్యాప్తంగా 300 గ్రామపంచాయతీల్లో ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఇంటింటి నుండి చెత్త సేకరణ- ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి.శాంతమణి తెలియజేశారు.
👉శనివారం ఉదయం రాజానగరంలో చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్ లో డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.నాగలత తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంత మణి మాట్లాడుతూ, రాష్ట్ర పంచాయతీ రాజ్ కమీషనర్ ఆదేశాలు జిల్లాలోని ప్రతి ఒక్క ఇంటిని రెండు రోజులు అందరు పంచాయతీ శాఖ అధికారులు ముఖ్యంగా అందరు జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా సమన్వయ అధికారులు, రిసోర్స్ పర్సన్స్, ఎఫ్ టీ సి లు, డివిజనల్ పంచాయితి అధికారులు, EO(PR&RD) లు అందరూ క్షేత్రస్థాయిలోనే ఉంచడం జరిగిందన్నారు. నూరు శాతం ఇంటింటి నుండి చెత్త సేకరణ జరిగేలా అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియ జేశారు.
👉ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కనీసం ఒక్కసారైనా ప్రతి గృహం నుండి చెత్త సేకరణ ఖచ్చితంగా చేయాలని శాంతామణి స్పష్టం చేశామన్నారు. ఇందులో భాగంగా గ్రామాలలో ఉన్న అన్ని చెత్తకుప్పలు, రోడ్ మార్జిన్/ రోడ్ ప్రక్కలలో ఉన్న పశువుల పేడదిబ్బలు తొలగించి, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించి సేకరణ వివరాలను P.R. one App నందు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ వివరాలు ఆధారంగా ఎంత మంది హరిత రాయబారులు పని చేశారు. ఎన్ని గృహాల నుండి చెత్తసేకరణ చేశారు, అనే వివరాలు నివేదికరూపంలో సేకరించనున్నట్లు తెలిపారు.
👉నిజానికి ఎంత చిన్న గ్రామమైనా ఇంటింటి నుండి చెత్త సేకరణ, చెత్త నుండి సంపద తయారీ, అక్కడ సంపద సృష్టి చేయడం వంటి వివరాలు ప్రతి వ్యక్తికి తెలిసేలా ఈ డ్రైవ్ నిర్వహించేందుకు అన్నీ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామాలుగా తీర్చి దిద్దే కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
👉ఈ కార్యక్రమంలోడివిజనల్ పంచాయతీ అధికారి ఎం.నాగలత , ఇతర పంచాయతీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.