ధర్మారావు ఫౌండేషన్ – పాలకొల్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఉచిత డీఎస్సి కోచింగ్ ” శిబిరాన్ని సందర్శించి, శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను ఉద్దేశించి కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రసంగించారు.
అనంతరం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. సుమారుగా 1000 మందికి లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఉచిత శిక్షణను ఇస్తున్నటువంటి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుని అభినందిస్తూ, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తన వంతు సహాయంగా, మా తండ్రి స్వర్గీయ భూపతిరాజు సూర్యనారాయణరాజు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ నుండి తొలి సేవాకార్యక్రమంలో విద్యార్థిని శిక్షణ కోసం 5 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించారు. యువత ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో చదివి విజయం సాధించాలని విజ్ఞప్తి చేశారు.