జగదాంబ జంక్షన్ వద్ద జనసేన పార్టీ జెండా ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ *
*పోస్టర్ ఆవిష్కరణ అనంతరం భారీగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ *
ఆవిర్భావ దినోత్సవ వేడుకకు భారీ హాజరైన జనసైనికులు వీరమహిళలు
*ఈనెల 14వ పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సదస్సుకు భారీగా జనం తరలి రావాలని పిలుపునిచ్చిన జనసేన పార్టీ విశాఖ అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ *
జగదాంబ జంక్షన్ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసైనికులు, వీర మహిళతో కలిసి భారీ కేకను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిఠాపురంలో 14వ తేదీన జరిగే భారీ సదస్సుకు ప్రతి ఒక్కరు భారీగా తరలి రావాలని కోరుతూ పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని గాక, దేశంలోనే ప్రజలందరూ జనసేన పార్టీ వైపు చూస్తున్నారని, ఈ నెల 14 న జరిగే భారీ బహిరంగసభ ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఉపముఖ్యమంత్రి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపిస్తారని అన్నారు. ప్రజలుకు సేవ చేయడంలో జనసేన పార్టీ శ్రేణులు ముందువుండాలని పిలుపునిచ్చారు. పార్టీలో మొదటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ లు, జనసేన పార్టీ సౌత్ నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి, జనసేన పార్టీ ఫ్లో లీడర్ 33 వార్డ్ కార్పొరేటర్ వసంత లక్ష్మి జి కె, 32వ కార్పొరేటర్ కందుల నాగరాజు, స్టేట్ డైరెక్టర్ రూప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రామ్మణ సంఘం చైర్మన్ బోధలపాటి. ఉమా, వివిధ వార్డుల అధ్యక్షులు, జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.