ప్రముఖ మలయాళం నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ షూటింగ్ సందర్భంగా రాజమండ్రి వచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి సి.టి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయనను గోదావరి నది ఓడ్డున మర్యాదపూర్వకంగా కలిసి, అలాగే మరిన్ని చిత్రాలను గోదావరి తీరాన చిత్రీకరించాలని కోరడం జరిగింది. సినిమాలు గోదావరి తీరన తీయడం వలన టూరిజం పెరుగుతుందని ఆయనకు వివరించారు. రాబోయే 2027 సంవత్సరంలో పవిత్ర గోదావరి పుష్కరాలు జరుగుతాయని తెలియజేశారు రాజమండ్రి సి.టి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
