త్రిసభ్య కమిటీని అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
రైతుల ప్రయోజనాలు కాపాడ విధంగా సొసైటీ అభివృద్ధికి త్రిసభ్య కమిటీ సభ్యులు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. అత్తిలి మండలం బల్లిపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు ముత్తంశెట్టి సత్తిబాబు, ఇతర డైరెక్టర్లు ప్రగడ శ్రీనివాస్, అరిగెల నగేష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గతం నుంచి గ్రామస్తులు, రైతులు సహకారంతో సొసైటీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఇదే ఒరవడిని భవిష్యత్తులో కొనసాగించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సొసైటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, అత్తిలి తెలుగుదేశం పార్టీ మండలం అధ్యక్షుడు చందు, అత్తిలి మండలం టిడిపి సీనియర్ నాయకులు ఆనాల ఆదినారాయణ, ఎఎంసి వైస్ చైర్మన్ కడలి రామాంజనేయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
