రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చాంబర్ లో రాధాకృష్ణ కలిసి తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. తణుకు నియోజకవర్గం లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను, మంజూరు కావలసిన నిధులపై సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే రాధాకృష్ణ చర్చించారు.
