తేతలి గ్రామంలో నడుస్తున్న లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పశువుల వద్ద శాల మూసివేయాలంటూ పశ్చిమగోదావరి జిల్లా తణుకు తేతలి గ్రామాల్లో గత నెల రోజులుగా వివిధ వర్గాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం తేతల గ్రామంలో జరిగిన సమావేశంలో గ్రామానికి చెందిన వందలాదిమంది మహిళలు తరలివచ్చారు అదేవిధంగా వివిధ వర్గాలకు చెందిన సామాజిక సేవ కార్యకర్తలు పాల్గొన్నారు గో సేవా సమితి సభ్యులు శ్రీనివాస్, రామరాజ్యం వ్యవస్థాపకులు వీరరాఘవరెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ నుండి పశువదశాల వద్ద శాంతియుతంగా దీక్షలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా తేతలి గ్రామ మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు పార్టీలకతీతంగా గ్రామ ప్రజల ఆరోగ్యం కొరకు ఈ ఉద్యమంలో పాల్గొంటామని అన్నారు. ఈ ఉద్యమం ఎవరిని కించపరచని విధంగా శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉద్యమం ఏ ఒక్కరి కోసం కాదని భవిష్యత్ తరాల బాగు కోసం, పర్యావరణ విధ్వంసం జరగకుండా, మూడు పంటలు పండే వ్యవసాయ భూములు త్వరలోనే వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయని అంతేకాకుండా ఇదేవిధంగా ఈ లేహం ఫుడ్ ఫ్యాక్టరీ కొనసాగితే పశ్చిమగోదావరి జిల్లాలో పశువులు అనేవి లేకుండా పోతాయని గో సేవా సమితి సభ్యులు అన్నారు. రేపు ఉదయం నుంచి కోట నాగేశ్వరావు సోదరులు వారి తల్లిదండ్రులు పేరుమీద ఈ కార్యక్రమం నిమిత్తం ఢిల్లీలో రైతు చేసినట్టుగా ఎన్నాళ్లయితే ఉందో, ఆ వధశాలనువేళ్ళతో పీకేవరకు ఉద్యమం చేయడానికి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరి పోషణ బాధ్యత వారి మేము తీసుకుంటామని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు ముందు నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో గో సేవా సమితి సభ్యులు జల్లూరు జగదీష్, గిరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
