–నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవిందబాబు
ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవిందబాబు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వినతులపై తక్షణం స్పందిస్తూ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, కాలువల నిర్మాణం వంటి కనీస వసతులపై అధికంగా విజ్ఞప్తులు వస్తున్నాయని, గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కనీస వసతులను కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్య స్థాపనకు అనుగుణంగా కూటమిప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.