ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో సుమారు ఏడు కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పర్యాటకం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిడదవోలు టిడిపి ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు కలిసి రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చివటం టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ఏర్పాటుచేసిన కూటమి ప్రభుత్వ ప్రభుత్వం మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించగా మంత్రి దుర్గేష్, బూరుగుపల్లి శేషారావు ఇరువురు కేక్ కటింగ్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన మొదలు మొదలై సరిగ్గా ఇదే రోజుకు సంవత్సరకాలం కావటం, అరాచక పాలన నుండి విముక్తి కోరుతూ జనసేన బిజెపి కూటమి అభ్యర్థులకు అఖండ మెజార్టీలతో గెలిపించిన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ… సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం ప్రభుత్వంపై ఉన్న 15 రోజుల్లోనే 3,000 పెన్షన్ 4,000, మంచానికి అంటిపెట్టుకొని ఉన్న దివ్యాంగులకు ఒకేసారి 15,000 రూపాయలు, చేసి సుమారు 64 లక్షల మందికి ఒకటవ తేదీనే ఇండ్ల వద్ద అందిస్తున్నామని, అదేవిధంగా దీపం పథకం, ఈరోజు నుండి అమలు కానున్న అమ్మకి తల్లికి వందనం ద్వారా ఒకటవ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 చొప్పున తల్లికి వందనం నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తున్నామని, రైతులకు ధాన్యం డబ్బులు జమ చేయటం, అదేవిధంగా పూర్వపు పద్ధతిలోనే రేషన్ షాపులు తిరిగి ప్రారంభించడం చేసామని, త్వరలో జూన్ 20వ తేదీ నుండి రైతు పెట్టుబడి సాయం అందిస్తామని అలాగే ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు పథకాన్ని సూపర్ సిక్స్ అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం చేపడుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు. పథకాల అమలులో కొద్ది జాప్యం ఉన్న కూడా కారణమైన గత ప్రభుత్వం విధానాల వల్లనే ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఆర్థిక లోటు ఏర్పడడం… ఈ పరిస్థితులలో ఎంతో సమర్థవంతంగా పారదర్శకంగా పరిపాలన అందించిన అనుభవం గల ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఎక్కడ నుండి డబ్బు తీసుకురావాలి ఏ ఏ రంగాలకు ఏ విధంగా ఖర్చు చేయాలి అని విజనరీ కలిగిన ముఖ్యమంత్రి కావడం చేత…. ఆయనకు ఎంతో చేయూతగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా కేంద్రం లో ప్రధాని మోడీ బిజెపి ప్రభుత్వం సహకారంతో భారీ ప్రాజెక్టులైన అమరావతి, పోలవరం, రైల్వే జోన్, నేషనల్ హైవేలు, ఓడరేవులు విమానాశ్రయాలు మౌలిక సదుపాయాలు కల్పించుకోగలుగుతూ ముందుకు వెళుతున్నామని అన్నారు. అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గంలో రమారమి 250 కోట్ల రూపాయల నిధులతో… డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా 174.73 73.కి.మీ నేషనల్, ఆర్ అండ్ బి, పంచాయితీ, గ్రామీణ రోడ్లు మరమ్మత్తులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. రానున్న రోజుల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, నేను ఒక కార్యాచరణతో నిడదవోలు నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కొరకు అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రజలందరి సహకారంతో కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలతో ఏకీభవించకుండా కూటమి ప్రభుత్వాన్ని మంచి మనసుతో ఆశీర్వదించాలని, మిగిలిన నాలుగు సంవత్సరాల కాలంలో మరింత అభివృద్ధి చేయడానికి ప్రజల ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, జనసేన మండల అధ్యక్షులు వీరమల్ల బాలాజీ, బిజెపి మండల అధ్యక్షులు కొప్పినీడి బాలాజీ, చివటం ఎంపిటిసి వేముల వెంకట సత్యనారాయణ, తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు, తహసిల్దార్ పీ యండి ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి. వి.వి.ఎస్. రామారావు, ఈఓపిఆర్డి కే. ఆంజనేయ శర్మ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.