టిడ్కో ఇల్లు లబ్దిదారులకు వెంటనే అందించాలి – సిపియం నాయకులు జువ్వల రాంబాబు.

నిడదవోలులో తీరుగూడెంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించకుండానే నిరుపేదలైన లబ్ధిదారులనుండి బ్యాంకర్స్ ఈఏంఐ కట్ చేసుకోవటం అన్యాయమని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు అభ్యంతరం వ్యక్తంచేశారు. టిడ్కో ఇళ్ల వద్ద బుధవారం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులు నిరుపేదలు చిన్నచిన్న షాపుల్లో మాల్స్ పనిచేసుకుంటున్నారు. నెలజీతాలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు, వేసిన వెంటనే బ్యాంకర్స్ EMI కట్ చేస్తున్నారు. దీనితో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే మంత్రి జోక్యం చేసుకుని లబ్ధిదారులతో పండుగలు ఆనందంతో జరుపుకొనే అవకాశం కల్పించాలని రాంబాబు కోరారు, పండుగలోపు ఇవ్వకపోతే 1200మంది లబ్ధిదారులతో నిరసన కార్యక్రమం చేపడతామని రాంబాబు అన్నారు.

Scroll to Top