తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో వున్న పద్మశాలి కుటుంబాలు అంతా మాపద్మశాలిల ఆడబిడ్డ అయిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి అమ్మవారికి, పసుపు కుంకుమలు, చీర సారె ఇచ్చే కార్యక్రమాన్ని తిరుచానూరులో అమ్మవారికి నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు నుండి వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులు పాల్గొని అమ్మ వారికి చీర సారె, పసుపు కుంకుమలు, పళ్ళు, తీపి పదార్థాలు అందచేయగా అర్చకులు అమ్మవారికి సమర్పించి, అనంతరం పాల్గొన్న వారందరికీ వేదపండితులు ఆశీర్వాదములు అందచేసి అనంతరం తీర్దప్రసాదములు అందచేసినారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ ఇలా గత 12 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని సరళాదేవి తెలిపారు.
ఈకార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పద్మశాలిలు పాల్గొన్ని అమ్మవారికి చీరా సారె సమర్పిస్తారని అని తెలియపరిచినారు. ఈ సాంప్రదాయాన్ని అమ్మవారు మాఇంటి ఆడపడుచుగా భావించి ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని కొనసాగుతున్నామని, సాంప్రదాయాన్ని మాకు అన్నివిధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి, లోకేష్ బాబుకి కూటమి ప్రభుత్వంకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీటీడి బోర్డు సభ్యురాలు తమ్మశెట్టీ జానకి, కుటుంబసభ్యులు, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య దంపతులు తిరుపతి వాస్తవ్యులు, కార్యనిర్వాహకులు ఓబులపతి, అఖిల భారత పద్మశాలి భవన అద్యక్షుడు జెల్లా లక్ష్మినారాయణ, నక్కా వెంకటేశ్వరరావు, తదితరులు ఎంతోమంది ప్రముఖులు మద్య ఈ కార్యక్రమాం మేళతాళాలతో మంగళవాయిద్యాలు నడుము ఎంతో వైభవంగా జరిగింది అని తెలియపరుస్తున్నాను.