నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు రూరల్ మండలం, తిమ్మరాజుపాలెం గ్రామంలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లైన్స్ వృద్ధాశ్రమం నందు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను సమాజం చిన్నచూపు చూడకుండా వారిలో మనోధైర్యాన్ని పెంపొందించాలని తద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వారు అవుతారని, హెచ్ఐవి సోకినంతమాత్రాన ఎయిడ్స్ వ్యాధి రాదు అని హెచ్ఐవి సోకిన కూడా తగిన జాగ్రత్తలు మందులతో చాలా సంవత్సరాలు ఎయిడ్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని, హెచ్ఐవి సోకగానే ఇక జీవితం సమాప్తం అయిపోయిందని చాలామంది జీవితంపై ఆశలు వదులుకొని, మానసిక క్షోభతో తమ ఆరోగ్య పరిస్థితిని ఇంకా పాడు చేసుకుంటున్నారని, ఆత్మవిశ్వాసంతో సరైన మందులు వాడితే పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం కూడా ఉందని, కావున ఎవరూ కూడా అధైర్యపడవద్దని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.