తణుకు జిల్లా ఏరియాహాస్పిటల్ ని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం ఆకస్మిక తనిఖీ చేసారు. తణుకు పట్టణంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకస్మిక తనిఖీ చేసినారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణ జిల్లా ఆస్పటల్ నందు పేషెంట్లను అందుతున్న వైద్య సదుపాయాల గురించి మరియు హాస్పిటల్ ను సందర్శించి ఇక్కడ జరుగుతున్న వైద్య సదుపాయాల గురించి తనిఖీ చేయడం జరిగిందని అన్నారు, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న పేద దిగువ మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యానికి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు ప్రభుత్వ పరంగా మరియు ఎక్కడ జిల్లా ఆసుపత్రి పరంగా ఇక్కడికి వచ్చిన పేషెంట్లు అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించడం జరుగుతుందని రాబోయేరోజుల్లో మరింత మెరుగైన చికిత్సలు అందే విధంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. నూతన మేనేజ్మెంట్ ను నియమించి వారి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపినారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సూపర్డెంట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఆసుపత్రిలో వార్డుల వారిగా తిరిగి సమస్యలు, పేషెంట్లకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.అరుణ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
