ఉండ్రాజవరం జడ్పీ ఉన్నత పాఠశాల యందు మంగళవారం ఉదయం ఉండ్రాజవరం మండలంలోని అంగన్వాడి కార్యకర్తలకు 120 రోజుల సర్టిఫికెట్ కోర్స్ జ్ఞానజ్యోతి మొదటి విడత ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం విద్యాశాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త నిర్వహణలో పూర్వ, బాల్య, సంరక్షణ విద్య, పునాది, అభ్యసన, బోధన లక్ష్యంగా ప్రారంభించినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మండల తహసిల్దార్ పి.ఎన్.డి.ప్రసాద్ మాట్లాడుతూ మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలలో పునాది అభ్యసన మెరుగుపరచడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో అంగన్వాడీలకు ఉపయోగపడుతుందని అన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి వివిఎస్ రామారావు, ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ పిల్లలలో నైతిక శారీరక మానసిక భావోద్వేగ అభివృద్ధి పెంపొందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా ఈ శిక్షణా కార్యక్రమంలో అంగన్వాడీలలో మరింత గుణాత్మక విద్యాభివృద్ధికి దోహదం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమ కోర్స్ డైరెక్టర్లు పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కె మాణిక్యాలరావు, ఎం.ఈ.ఓ. సిహెచ్. సక్సేనా రాజు, పి.గురుమూర్తి రిసోర్స్ పర్సన్స్ యర్రా కాశీ విశ్వనాథం, తమ్మిశెట్టి శ్రీనివాసు, ఎం.తిరుపతిరావు, సూపర్వైజర్లు ఎం భాగ్యలక్ష్మి ఎం.బాల సరస్వతి, సి.ఆర్.పి లు తదితరులు పాల్గొన్నారు.
