జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయి

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన భారత పౌరులకు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికులు మురళీ నాయక్ ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. మనందరం గౌరవంగా భావించే స్త్రీల నుదటన ఉగ్రవాదులు సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధీరత్వాన్ని మంత్రి దుర్గేష్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రస్థావరాలపై దాడి జరిపి భారతదేశ ప్రతిష్టను నెలబెట్టారని తెలిపారు. శాంతి కాముక దేశమైన భారత్ లో భారతీయులు కోరుకునేది శాంతి అన్నారు.కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న సువిశాల భారతదేశంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమేనని మంత్రి దుర్గేష్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించిన ఏకైక దేశం భారత దేశమన్నారు.తీవ్రవాదులు భారత్ పై దండెత్తితే ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పిన ప్రధాన మోదీకి, ఆయనకు సహకరించిన జవాన్ లకు సెల్యూట్ అని చెప్పారు. నేడు మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు తామంతా వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జెండా నీడలో ముందుకు వెళ్తూ భారతమాత ఆశీస్సులతో సైనికులతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని అందుకే మువ్వన్నెల జెండాను పట్టుకొని తిరంగా ర్యాలీ ద్వారా తామంతా భారతీయులమనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా నినదించాలని పిలుపునిచ్చారు.

Scroll to Top
Share via
Copy link