కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను పరామర్శించిన ఆరిమిల్లి

నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు ఇటీవల మరణించారు. ఈ సంధర్బంగా శనివారం కేంద్రమంత్రి గృహంలో భూపతిరాజు సూర్యనారాయణరాజు చిత్రపటానికి తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత అయిదు నెలలుగా వర్మ తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తమ కేంద్రమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు తండ్రి ఆరోగ్య చికిత్స వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి మరియు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు కలిసి వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి నివాళులు ఘనంగా అర్పించారు.

Scroll to Top