సౌత్ మెగా కన్స్యూమర్ ఎవేర్నెస్ కేంపైన్ కార్యక్రములో భాగంగా తణుకు తహశీల్దారు కార్యాలయము నందు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రములో డా: చదలవాడ హరిబాబు మాట్లాడుతూ భారత ఆహార పదార్ధాల ప్రమాణాల సంస్థ వారి ఉత్తర్వులు మేరకు ప్రతి ఆహార పదార్ధాల ప్యాకింగ్ పై ఖచ్చితంగా “+F” అనే చిహ్నం ఉండాలని ఈ చిహ్నం యొక్క అర్ధం బలవర్ధకమైన ఆహారమనియు, సంపూర్ణ పోషణ ఇచ్చే ఆహారం అని నిర్ధారించాలని, అదేవిధంగా ప్రతి పాల ప్యాకెట్ పై విటమిన్ ఏ, విటమిన్ డి అనే చిహ్నంను తప్పనిసరిగా ముద్రించాలనియు అదేవిధంగా ప్రతి ఉప్పు ప్యాకెట్స్ పై ఐరన్, అయోడిన్, ఉన్నట్లు ముద్రించాలని, ప్రతి మైదా, గోధుమపిండి బియ్యం వంటి ప్రతి ప్యాకెట్ పై విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్స్ వంటి వాటిని ఖచ్చితంగా ముద్రించాలని వినియోగదారులకు వీటిపై అవగాహన కలిగి యుండాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమములో తహశీల్దారు అశోక్ వర్మ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్ లో లబించే ఆహార పదార్ధాలు కొనుగోలు చేసే విషయములో వినియోగదారులు ఆహార పదార్ధాల నాణ్యతా ప్రమాణాలపై తగినంత అవగాహన కలిగియుండాలనియు వినియోగదారులు బలవర్ధకమైన ఆహారాన్ని వినియోగించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమములో మండల తహశీల్దారు డి.వి.ఎస్.ఎస్.అశోక్ వర్మ, జాతీయ వినియోగదారుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు డా: చదలవాడ హరిబాబు, జిల్లా వినియోగదారుల సంఘ ప్రెసిడెంట్ జి. నాగ రామశంకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు తాతపూడి మారుతీరావు, వీర భ్రమ్మాచారి, కార్యాలయ డిప్యూటీ తహశీల్దార్ శ్రీదేవి, డిప్యూటీ తహశీల్దారు శివ శంకర్ పాల్గొన్నారు.