నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 20 మంది బాధిత లబ్ధిదారులకు ఒకేసారి రూ.15 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నిడదవోలులోని స్థానిక మంత్రి కార్యాలయంలో ఈ మేరకు లబ్ధిదారులతో ఆరోగ్య పరిస్థితుల వివరాలను తెలుసుకొని చెక్కులు అందించారు. కష్టంలో, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులుతో ఆర్థికసాయం అందజేసిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సత్వరం సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు కృషిచేసిన మంత్రి కందుల దుర్గేష్ కి సందర్భంగా బాధిత లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపగా, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలిరెడ్డి వెంకటరత్నం, కాకర్ల నాని, ఉలుసు సౌజన్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.