వార్త‌లు

అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మాణం చేపట్టాలి.-ఏ.ఐ.ఎస్.ఎఫ్.

అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మాణం చేపట్టాలని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఇటీవల శాసనసభ సమావేశాలలో చర్చించిన సందర్భంగా ఏ ఐ ఎస్ ఏ. నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో .ఏ ఐ ఎస్ ఏ . సమావేశం జరిగింది ఈ సందర్భంగా. ఏ ఐ ఎస్ ఏ . జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి మాట్లాడుతూ ఏళ్ల తరబడి అత్తిలి ప్రభుత్వ జూనియర్ […]

వార్త‌లు

తణుకు బార్ అసోసియేషన్ లో డా.బి.ఆర్.అంబెద్కర్ 68వ వర్ధంతి

తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బార్ అసోసియేషన్ ఆవరణలో డా.బి.ఆర్. అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.రాజ్యాంగ ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్ధ పరిరక్షణకు ప్రతీఒక్కరూ కృషి చేయడం ద్వారా అంబేద్కర్ ఆశయ సాధనకు పూనుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. అంబిత్, ఈదా రామకృష్ణ, ఎం. సాంసన్, పోట్ల విజయ్,

వార్త‌లు

అంబేద్కర్ గొప్ప దార్శనికుడు – సీపీఐ జిల్లాకార్యదర్శి కోనాల భీమారావు

దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గొప్ప దార్శనికుడని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తణుకు ఎన్టీఆర్ పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా భీమారావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మతతత్వ పాలనతో రాజ్యాంగానికి తీవ్ర ముప్పు ఏర్పడిందన్నారు. సమాజాన్ని ముక్కలుగా చీల్చి, సామాజిక అసమానతలకు పునాదులు వేసే మనుస్మృతి అమలుకు బిజెపి పూనుకుంటుందన్నారు. రాజ్యాంగ ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్ధ పరిరక్షణకు

వార్త‌లు

కర్ణాటక సంగీతం, సాంప్రదాయ హస్తకళలు, వంటకాల వారసత్వానికి గొప్ప వేదికగా కృష్ణవేణి సంగీత నీరాజనం – మంత్రి కందుల దుర్గేష్

సంగీత పర్యాటకం, వారసత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో చేపట్టిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి హాజరైన కేంద్ర పెట్రోలు, సహజ వాయువులు, పర్యాటక సహాయక మంత్రి సురేష్ గోపి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక సలహాదారు జ్ఞానభూష్ , రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు,

వార్త‌లు

బి.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ 68 వర్ధంతి.

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్బంగా పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో జడ్పీహెచ్ హైస్కూల్లో బహుజన సమాజ్ పార్టీ నాయకులు ప్రధానోపాధ్యాయులు టీచర్స్ అందరూ కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన బి.ఎస్.పి. పెరవలి మండలం అధ్యక్షులు బద్దజాను మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలనీ మరియు విద్యార్థినివిద్యార్థులు అంచెలంచెలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదివి చదవడమే కాకుండా పాఠశాలలో టీచర్స్ రాజ్యాంగం

వార్త‌లు

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కృష్ణాజిల్లా రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు ఏలూరు జిల్లా రైస్ మిల్లర్లు సానుకూలంగా స్పందించాలి

రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ పి. దాత్రిరెడ్డి…. కృష్ణాజిల్లా రైతుల నుండి ధాన్యం కొనుగోలు పై జిల్లా రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అత్యవసర సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా రైస్ మిల్లర్స్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.దాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.

వార్త‌లు

ధాన్యం అమ్మకం మిల్లుల ఎంపికకు రైతుకే పూర్తి స్వేచ్ఛ, రైసు మిల్లులు యజమానులు సహకరించాలి – ప.గో.జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి

ఆరబెట్టిన ధాన్యాన్ని త్వరితగతిన రైతు మీసేవా కేంద్రాన్ని సంప్రదించి నచ్చిన రైసు మిల్లులకు రైతులు తరలించుకోవాలి. ప.గో.జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి పాలకోడేరు గ్రామంలో శుక్రవారం ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. శృంగవృక్షం యస్వివియస్ రైసుమిల్లును జిల్లా జాయింటు కలెక్టరు తనిఖీ చేశారు. ఈ సందర్భంలో ధాన్యం తీసుకు వచ్చిన రైతులతో మాట్లాడారు. ధాన్యం తూకం తూసేమిషన్లు పరిశీలించి ఒక బస్తాను వేసి తూకం చూసారు. కొంత ధాన్యం వేసి తేమశాతాన్ని స్వయంగా

వార్త‌లు

ఇండియా పూలే అంబేడ్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేడ్కర్ 68వ వర్ధంతి

భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గొప్ప దార్శనికుడని ఆల్ ఇండియా పూలే అంబేడ్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ అన్నారు. అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తణుకు జూనియర్ కాలేజీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా సురేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మతతత్వ పాలనతో రాజ్యాంగానికి తీవ్ర ముప్పు ఏర్పడిందన్నారు. సమాజాన్ని ముక్కలుగా చీల్చి, సామాజిక అసమానతలకు పునాదులు వేసే మనుస్మృతి అమలుకు బిజెపి పూనుకుంటుందన్నారు. రాజ్యాంగ

వార్త‌లు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తణుకు పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన తణుకు నియోజవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగి, విదేశాల్లో విద్యను అభ్యసించి ఈ దేశానికి ఒక దిశ దశ నిర్దేశించినటువంటి మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది అంటే దానికి

వార్త‌లు

ఆరోగ్యానికి పరిశుభ్రత కూడా అంతే అవసరం – వాకర్స్ క్లబ్ తణుకు

తణుకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాలలో జిమ్ ను వాకర్స్ సభ్యులు గురువారం శ్రమదానం చేసి శుభ్రం పరచినారు. ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు బసవా రామకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అని, పరిశుభ్రత కూడా ఆరోగ్యానికి అంతే అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బసవ రామ కృష్ణ, ట్రెజరర్ చిక్కాల సత్యనారాయణ, సభ్యులు యలమర్తి రాజేంద్ర బాబు, అడ్డాల నారాయణ, శివాజీ, మణికంఠ, గాదె సూరి బాబు,

Scroll to Top