వార్త‌లు

గతపాలకులు తణుకు పట్టణ అభివృద్దిని నిర్లక్ష్యం చేసారు

తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక 22వ వార్డులో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు, సమస్యల నుండి విముక్తి చేసేందుకు గ్రామదర్శిని కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గడిచిన గత ఐదు సంవత్సరాలు కాలంలో తణుకు మున్సిపాలిటీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అన్నారు. 22 వార్డు పర్యటనలో పాల్గొని స్థానికులు సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. గత […]

వార్త‌లు

పొలీసు అమరవీరుల సంస్మరణదినం అక్టొబర్ 21

విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరుల సంస్మరణార్థం నిర్వహించుకుని, భావితరాలకు వారి త్యాగాలను తెలియజెప్పడమే అమరవీరుల సంస్మరణ దిన ఉద్దేశమని పోలీసు అధికారుల తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం అక్టోబర్ 21వ తేదీ సోమవారం తణుకు పట్టణ, రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగ ఫలాలను వివరిస్తూ పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నరేంద్ర సెంటర్ యందు అమరవీరుల స్థూపము వద్ద పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ

వార్త‌లు

అమరవీరుల త్యాగాలే – నేటి తరాలకు ఆదర్శాలు – ఏస్సై జానా సతీష్

కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21వ తేది సోమవారం ఇరగవరం ఎస్ఐ జానా సతీష్, స్టేషన్ సిబ్బంది, మండలంలోని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ అమరవీరుల సంస్మరణగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను మరువరాదని, వారి స్ఫూర్తితో కర్తవ్యం నిర్వహణలో పాల్గొనాలని, వారు చేసిన త్యాగాల ఫలితమే నేటి మన ప్రశాంత జీవనం అని ఎస్సై

వార్త‌లు

అమరవీరుల త్యాగాలను మరువలేము- ఎస్.ఐ. జి.శ్రీనివాసరావు

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21వ తేది సోమవారం ఉండ్రాజవరం ఎస్ఐ జి.శ్రీనివాసరావు, స్టేషన్ సిబ్బంది, మండలంలోని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఎం.వి.ఎన్.జడ్.పి.హైస్కూల్ ప్రధానోపాద్యాయులు మాణిక్యాలరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ అమరవీరుల సంస్మరణగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను మరువరాదని, వారి స్ఫూర్తితో కర్తవ్యం నిర్వహణలో పాల్గొనాలని ఎస్సై జి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా బాల బాలికలతో

వార్త‌లు

గత ప్రభుత్వం మోసం చేసింది – చుక్కా సాయిబాబు

పల్లె- పండగ అనే కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒకపక్క సంక్షేమం మరొకపక్క అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనలతో 22 లక్షల వ్యయంతో డ్రైనేజీ శంకుస్థాపన,2.30 లక్షల వ్యయంతో మినీ గోకులం శంకుస్థాపన చేయడం జరిగింది అని, అలాగే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మాజీ జడ్పిటిసి జిల్లా

వార్త‌లు

దమ్మెన్ను గ్రామంలో రీసర్వే గ్రామసభ

ఉండ్రాజవరం మండలం, దమ్మెన్ను గ్రామంలో సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ అధ్యక్షతన శనివారం గ్రామసభ నిర్వహించబడింది. ఈ సమావేశంలో భూముల రీ సర్వేలో వచ్చిన సమస్యలకు సంబంధించి వినతులను స్వీకరించడం జరిగిందని తహసిల్దార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు సర్వే సందర్భంగా ఏర్పడిన సమస్యలను అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో మండల, గ్రామ రెవేన్యూ అధికారులు, సచివాలయ ఉద్యొగులు పాల్గొన్నారు.

వార్త‌లు

సి.పి.యం పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన ధరలపై రాస్తారోకో

పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నాడు రేలంగి గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం పార్టీ మండల పార్టీ కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని దీని వెంటనే ప్రభుత్వం అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇసుక లేక బిల్డింగు కార్మికులు పనులు లేక పస్తులతో కాలం గడుపుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజల సమస్యలను

వార్త‌లు

కొత్తపల్లిలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన కందుల

నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, కొత్తపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్వహించబడిన పల్లె పండుగ-పంచాయితీ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లను శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ ఉల్స ఉలుసు సౌజన్య సత్య సాయి, ఉమ్మడి కూ టమి నాయకులు పాల్గొన్నారు.

వార్త‌లు

తణుకులో రోడ్ భద్రతా వారోత్సవాలు

తణుకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆటో డ్రైవర్లకు రోడ్డు రోడ్ సేఫ్టీ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం తణుకు పట్టణ ప్రధాన మార్గంలో రోడ్ సేఫ్టీ యొక్క నిబంధనలు మరియు డ్రైవర్లు పాటించవలసిన నియమాలు గురించి హెల్మెట్ యొక్క ఆవశ్యకత మరియు ధరించకపోవడం చేత ప్రమాదాలు జరిగినప్పుడు కలిగే ఎక్కువ నష్టం గురించి సవివరముగా వారికి తెలియజేయడం జరిగిందని పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ఆటో డ్రైవర్లు సామాన్య ప్రజలు పాల్గొన్నారు.

వార్త‌లు

ఉండ్రాజవరం గ్రంథాలయం లో మహర్షి వాల్మీకి జయంతి

ఉండ్రాజవరం శాఖ గ్రంధాలయంలో గురువారం శ్రీ మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో వాల్మీకి చిత్రపటానికి పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావులు మాట్లాడుతూ వాల్మీకి సాంస్కృతిక సాహిత్యంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి అని వాల్మీకి రామాయణం వ్రాసి, సంస్కృతిక భాష ఆదికవిగా గుర్తిస్తారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు పాఠకులు ఏం.వి. కృష్ణారావు, వంగా చందర్రావు, పి.శ్రీను, టీ.వరప్రసాద్, కాయల వీర వెంకట

Scroll to Top