నాన్నకు ఇందనం ఇచ్చారు – తల్లికి వందనం మరిచారు
నాన్నకి ఇందనం ఇచ్చి, తల్లికి వందనం మరిచారని ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు ఇవ్వకుండా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇస్తామనడం మోసపూరితమైన చర్య అని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ ఐ ఎస్ ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి ధ్వజమెత్తారు. ఈ మేరకు తణుకులో శుక్రవారం స్థానిక శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో ఏ ఐ ఎస్ ఏ. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. […]