వార్త‌లు

అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశానికి శరణ్యం – అరిగెల రాజేష్

రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా తేతలి అంభేథ్కర్ యూత్ ఆధ్వర్యంలో అంభేథ్కర్ వారివిగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించిన అనంతరం జరిగినసమావేశంలో నాయ్యవాది వాయిస్ ఆఫ్ దళిత్ వ్యవస్థాపకులు అరిగెలరాజేష్ మాట్లాడూతు రాజ్యాంగం రచించిన సమయంలో అంభేథ్కర్ ఎన్నోమానసిక ఒత్తిడికి లోనై తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా 2సంవత్సరాల11నెలల18రోజులలో రాజ్యాంగాన్ని పూర్తిచేసి 1949 నవంబరు26వతేదిన బారతరాజ్యాంగ పరిషత్ కు అందించి పరిషత్ లో ఆమోదింపబడిన ఘనమైనరోజని అన్నారు. అంభేథ్కర్ అందించిన రాజ్యాంగమే ఈదేశానికి శరణ్యమని తెలిపారు. ఈకార్యక్రమంలో తేతలి అంబేద్కర్ యాత్, […]

వార్త‌లు

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరశన

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇరగవరం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారంలోనికి వచ్చినటువంటి దేశంలో మత చిచ్చు పెడుతూ దేశంలోనే సమైక్యతను భగ్నం చేస్తుందని అన్నారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలన్నిటిని మార్చడానికి ప్రయత్నం చేస్తుందని దాన్ని ప్రతిపక్షాలు నిరోధిస్తున్నవేని

వార్త‌లు

వెంకటరాయ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా మరిన్ని వైద్యసేవలు అందుబాటులోనికి

తణుకు పట్టణంలో స్థానిక వేల్పూరురోడ్డు లో ఉన్న ముళ్ళపూడి వెంకటరాయ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ చే మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (MICU) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ముళ్లపూడి ట్రస్ట్ హాస్పిటల్ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం పొందే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఈ ట్రస్ట్ హాస్పిటల్ నందు కల్పించడం

వార్త‌లు

మన రాజ్యాంగానికి సాటి ప్రపంచములో ఏరాజ్యాంగానికీ లేదు – ఆరిమిల్లి

తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాల అయిన సందర్భముగా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలుతెలియజేసారు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనటువంటి ఒక రాజ్యాంగం మన దేశం యొక్క మత సామరాస్యాన్ని, అన్ని వర్గాల హక్కుల్ని కాపాడుచూ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశ

వార్త‌లు

రాష్ట్రం అభివృద్ధికి 2047 విజన్ ద్వారా కూటమి ప్రభుత్వం ముందుకు – ఆరిమిల్లి

తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మీడియా సమావేశం నిర్వహించినారు, ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎస్సీ పథకాలను రద్దుచేసి sc.st సబ్ ప్లాన్ నిధులు అన్నీ కూడా పక్కతో పట్టించి ఆ వర్గానికి ఎంత అన్యాయం చేశారో మనందరికీ తెలిసిన విషయమైనా అన్నారు.ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు సంబంధించి బడ్జెట్ కేటాయించి పంచడం జరిగిందని అన్నారు. అలాగే

వార్త‌లు

భారత రాజ్యాంగ దినోత్సవ 75వ సంవత్సర వేడుకలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో భారత రాజ్యాంగ దినోత్సవ 75వ సంవత్సర వేడుకలు మంగళవారం ఉండ్రాజవరం మండలంలో మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాల నుండి పంచాయతీ కార్యాలయాల వరకు, అన్ని పాఠశాలలలోనూ వేడుకలు నిర్వహించారు. తాడిపర్రు అమృత సరోవర్ చెరువు వద్ద ఎంపీడీవో వి.వి.వి. రామారావు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బి.ఆర్.అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలంగి గ్రామపంచాయితీలో గ్రామసర్పంచ్ బొక్కా శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ఎం. డి. హసన్ జానీ

వార్త‌లు

ప్రజలు చట్టాలను తమచేతుల్లోకి తీసుకోవడం చట్టవ్యతిరేకమే

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు విశాఖపట్నంలో లా విద్యార్థినిపై అత్యాచారము, తమిళనాడులో న్యాయవాది దారుణహత్యకు నిరసనగా న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించినారు. భారత న్యాయవాదుల సంఘం, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై అత్యాచారం చేయడం దృశ్యాలను వీడియాలో చిత్రీకరించిబ్లాక్ మెయిల్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని బాద్యులను కఠినంగా

వార్త‌లు

ప్రజల సంక్షేమం, అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం – మంత్రి కందుల దుర్గేష్

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఈ సంధర్బంగా ఆయన జనవాణిలో వివిధజిల్లాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి బాధితుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క అర్జీని నిశితంగా పరిశీలించి అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు తెలిపి ప్రజల సమస్యల పరిష్కారమే తమకు ప్రధానమని అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలించి సత్వరం

వార్త‌లు

ఉండ్రాజవరంలో లింగవివక్షతపై అవగాహన సదస్సు- ప్రతిజ్ణ

సమాజంలో పిల్లలు, ఆడ, మగ అనే లింగ వివక్షత చూపరాదని ఉండ్రాజవరం మండల తహశీల్దార్ పి.ఎన్డి.ప్రసాద్ సూచించారు. సోమవారం మండల కేంద్రం, వెలుగుకార్యాలయంలో ఏపిఎం టి.బాలకోటయ్య అధ్యక్షతన నిర్వహించిన లింగవివక్షతపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలోని ప్రజలు, వివిధ భాగస్వాములు, లింగ సమానత్వ సమస్యలపై దృష్టి సారించడానికి స్వయం సహాయక సంఘాలు, వివిధ ప్రభుత్వ విభాగాలు, వివిధ పౌర సమాజ సంస్థలు మధ్య కలయిక సులభతరం చేయడానికి, సమాజంలో ప్రవర్తన, మార్పు తీసుకురావడానికి, వివిధ లింగ

వార్త‌లు

చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వకళాశాల 1992-95 విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

శ్రీ చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాల (స్వ. ప్ర.),తణుకు నందు 1992-95 సంవత్సరాలలో బి. ఎస్సీ నందు ఎంపీసీ ,ఎంపీఈ , సి బి జెడ్ గ్రూపులలో చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కళాశాల ఇన్-చార్జి ప్రిన్సిపాల్ శ్రీ ఆర్ కె ఫణిధర్ అధ్యక్షత వహించి, కళాశాల అభివృద్ధికి ప్రిన్సిపాల్ డా. పి అనిల్ కుమార్ చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్భంగా నాటి మధుర స్మృతులను గుర్తు

Scroll to Top